Tuesday, May 30, 2023

జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌..

ముంబై: ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌ల అనంతరం జింబాబ్వే టూర్‌ వెళ్లనుంది. ఈ టూర్‌లో టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 18న హరారే వేదికగా జరుగనున్న తొలి వన్డేతో సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ టోర్నమెంట్‌ మొదలుకానుండటంతో జింబాబ్వే టూర్‌కు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను పంపాలని బీసీసీఐ యోచిస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుంది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న రాహుల్‌ విండీస్‌ టీ20 సిరీస్‌తో తిగిరి జట్టులోకి రానున్నాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. విండీస్‌ టీ20 సిరీస్‌కు ముందు రాహుల్‌ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం ఉంది.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement