Monday, April 29, 2024

ప్రయాణికులకు గమనిక.. ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు

ఆధునికీకరణ పనులతో రేపు, ఎల్లుండి కొన్ని రైళ్లు రద్దయ్యాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పనుల నేపత్యంలో 4,5 తేదీల్లో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేల్‌ డివిజన్‌ అధికారులు వెల్లడించారు. 18301-18302 నంబర్‌ గల సంబల్‌పూర్‌ -రాయగడ-సంబల్‌పూర్‌, 22820-22819 విశాఖపట్నం – భువనేశ్వర్‌ – విశాఖపట్నం ఇంటర్‌ సిటీ, 18531-18531 నంబర్‌ గల విశాఖపట్నం-పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-కోరాపుట్‌-విశాఖపట్నం 08546-08545, 18417-18418 నంబర్‌ గల పూరి – గుణపూర్‌ – పూరి రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా సంబల్‌పూర్‌ డివిజన్‌లో ఆధునీకీకరణ పనుల కారణంగా రద్దైన పలు రైళ్లను వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పునరుద్దరించనున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement