Friday, May 3, 2024

National : బీజేపీలో చేర‌కుంటే అరెస్టులు చేస్తార‌ట‌… మంత్రి అతిషి..

బీజేపీలో చేరకుంటే నెల రోజుల్లో అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నార‌ని మంత్రి అతిషి పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు రావడంతో మంత్రి అతిషి ఇవాళ స్పందించారు. తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అతడి ద్వారి బీజేపీ పేర్కొనింది అని మంత్రి అతిషి వెల్లడించింది.

- Advertisement -

తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ద్వారా కమలం పార్టీ తనను సంప్రదించిందని తెలిపింది. అయితే, ముందుగా ఆప్ అగ్రనేతలను అరెస్టు చేశారు.. ఇక, లోక్ సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్ నేతలను అరెస్ట్ చేయాలని బీజేపీ భావిస్తోంది అని మంత్రి అతిషి వెల్లడించింది.

సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ విచ్ఛిన్నమవుతుందని బీజేపీ ఊహించిందని మంత్రి అతిషి అన్నారు. ఆప్ కి చెందిన నలుగురు నేతలను అరెస్ట్ చేయడం సరిపోదని.. ఇప్పుడు మరో నాలుగురిని అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుందని ఆమె ఆరోపించారు. మరి కొన్ని రోజుల్లో ఈడీ, సీబీఐ ఆప్ నేతలకు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేయాలని బీజేపీ చూస్తుందని మంత్రి అతిషి చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement