Sunday, May 19, 2024

ఏ దేశానికీ వ్యతిరేకం కాదు: ఇమ్రాన్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ స్వరం మార్చారు. ఇప్పటి వరకు తనని గద్దె దింపడానికి విదేశీ శక్తులు కుట్రపన్నాయని ఆరోపించిన ఆయన తాజాగా తన వైఖరిని మార్చుకున్నారు. తనకు భారత్‌ సహా ఏ దేశంపైనా ద్వేషం లేదన్నారు. తన మద్దతుదారులతో కరాచీలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకరకంగా ఆయన దీన్ని బలప్రదర్శనగా చూపించదలిచారు. అక్కడి జనసమూహాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఇమ్రాన్‌ ”నేను ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. భారత్‌, ఐరోపా, అమెరికా.. దేన్నీ నేను ద్వేషించను. నేను ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు” అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి వివిధ వేదికలపై గతంలో ఇమ్రాన్‌ భారత్‌, అమెరికా సహా కొన్ని ఐరోపా దేశాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పదవి కోల్పోవడానికి కొన్ని రోజుల ముందు విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఇమ్రాన్‌ తన పార్టీవర్గాలకు పిలుపు నిచ్చారు.

తాను రష్యా పర్యటనకు వెళ్లడం ఇష్టంలేని అమెరికాయే ఈ కుట్రను ఎగదోస్తోందంటూ అగ్రరాజ్యంపై ధ్వజమెత్తారు. మరోవైపు ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ఓటేయాని ఐరోపా సమాఖ్య కోరగా.. ”మీరెలా చెబితే అలా వినడానికి మీమేమైనా మీ బానిసలమా?” అని విరుచుకుపడ్డారు. అయితే, తాను పదవికి దూరమవడానికి కొద్దిరోజుల ముందు నుంచీ భారత్‌పై ఇమ్రాన్‌ తన వైఖరికి భిన్నంగా వ్యవహరించారు. పలు సందర్భాల్లో భారత విధానాలపై ప్రశంసలు కురిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement