Saturday, May 4, 2024

హింస వద్దు, మీ వెంటే మేం.. ఆందోళనకారులకు సోనియా వినతి

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన వివాదాస్పద అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసేవరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ పోరాడుతామని, ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళనలకు కాంగ్రెస్‌ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఏఐసీసీ సారథి సోనియాగాంధీ ప్రకటించారు. అయితే నిరసనలకు దిగిన ఆందోళనకారులు హింసకు పాల్పడవద్దని సూచించారు. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో వైద్యచికిత్స పొందుతున్న ఆమె ఆస్పత్రి నుంచి హిందీలో ఓ ప్రకటన చేశారు.

దిశ అంటూ లేకుండా, సైన్యంలో చేరాలనుకుంటున్నవారి ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండానే కేంద్రం ఈ పథకాన్ని రూపొందించిందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ పథకం పట్ల మాజీ సైనికాధికారులు కూడా సందేహాలు వ్యక్తం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఆందోళనకారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ఓ దేశభక్తురాలిగా పోరాడుతుందని, అయితే హింస లేకుండా శాతియుతంగా, సహనంతో వ్యవహరించాలని అభిలషించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement