Sunday, April 28, 2024

సొంత రూల్స్‌ వద్దు.. మహారాష్ట్రకు కేంద్రం లేఖ

దేశీయ ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టును తప్పనిసరి చేయడంతోపాటు, ఒమిక్రాన్‌ ప్రమాద దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి నిబంధనలు విధిస్తూ మహారాష్ట్ర ప్రభుతం నిర్ణయించింది. ఈ ఆంక్షలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమల వాలని సూచించింది. ప్రస్తుతం జాతీయస్థాయి మార్గదర్శకాలను పాటించాలని కోరింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ బుధవారం ఆ రాష్ట్రానికి లేఖరాశారు. ఇదిలావుండగా, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో మరోదఫా లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement