Thursday, April 25, 2024

National – విరాళాలు లేకుండా పార్టీని ఎలా న‌డుపుతాం… నితిన్ గడ్కరీ

గాంధీన‌గ‌ర్ – మంచి ఉద్దేశంతోనే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ . విరాళాలు లేకుండా ఏ రాజకీయ పార్టీని నడపడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయ‌న ఎన్నికల బాండ్ల అంశాన్ని ప్రస్తావించారు. ”అరుణ్‌ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం గురించి జరిగిన చర్చల్లో నేను కూడా పాల్గొన్నా. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదు. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు. అందుకే కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం పార్టీలు నేరుగా నిధులు పొందేందుకే. అయితే, అధికారంలో ఉన్న పార్టీ మారితే సమస్యలు తలెత్తుతాయన్న కారణంతో దాతల పేర్లను బయటపెట్టలేదు” అని గడ్కరీ వెల్లడించారు.

వాస్త‌వాల‌ను గుర్తించాలి..

”క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నిధుల్లేకుండా పార్టీలు ఎన్నికల్లో ఎలా పోరాడుతాయి? విరాళాల్లో పారదర్శకత ఉండాలన్న మంచి ఉద్దేశంతోనే మేం ఈ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లు సుప్రీంకోర్టు గుర్తిస్తే సరిదిద్దమని పార్టీలను కోరాల్సింది. అలాంటి ఆదేశాలు వస్తే పార్టీలన్నీ కలిసి కూర్చుని దీనిపై చర్చించుకోవాలి” అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement