Tuesday, May 30, 2023

లవర్నె పెళ్లి చేసుకున్నాడు.. ఓ ఇంటివాడైన టిమ్‌ సౌథీ..

న్యూజిలాండ్‌ ఆటగాడు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ టిమ్‌ సౌథీ.. ఇంటి వాడయ్యాడు. తాను ప్రేమిస్తున్న బ్రయా ఫహీని పెళ్లి చేసుకున్నాడు. రెండ్రోజుల కింద ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా భారత సంతతి అమ్మాయిని విని రామన్‌ను మనువాడాడు. తాజాగా సౌథీ కూడా పెళ్లి చేసుకున్నాడు. సౌథీ తన పెళ్లి ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి ఫరెవర్‌ అని క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో నెట్టింట సౌథీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సౌథీ జంట చాలా కాలంగా రిలేషన్‌ షిప్‌లో ఉంది. వీరికి పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.

2017లో ఇండీ మే సౌథీ, 2019లో స్లోయానే అవా సౌథీ వీరికి జన్మించారు. కివీస్‌ ఆల్‌ రౌండర్‌ అయిన సౌథీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కేకేఆర్‌ జట్ల తరఫున 43 మ్యాచులు ఆడి.. 31 వికెట్లు తీసుకుని.. 118 పరుగులు చేశాడు. 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో సౌథీని కేకేఆర్‌ జట్టు.. బేస్‌ ప్రైజ్‌ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement