Friday, April 19, 2024

హోమియో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలచేసిన కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆల్‌ ఇండియా కోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ #హూమియోపతి కళాశాలలోని ఆల్‌ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 21న ఉదయం 10గంటల నుంచి 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు కళాశాల వారీగా వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ-2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఆల్‌ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement