Friday, December 6, 2024

New Rules – ఎన్నిక‌ల ప్ర‌చారంలో పిల్ల‌ల్ల‌ను ఉప‌యోగించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు…రాజ‌కీయ నేత‌ల‌కు ఈసీ వార్నింగ్

న్యూఢిల్లీ – లోక్‌సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు, కరపత్రాలతో సహా ఎటువంటి ప్రచార సామాగ్రిలో పిల్లలను ఏ రూపంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పార్టీలు కానీ.. అభ్యర్థులు కానీ ఏ విధంగానైనా పిల్లలను ఉపయోగించుకోవడం పట్ల ఎన్నికల సంఘం “జీరో టాలరెన్స్” విధానాన్ని తెలుపుతుందని పేర్కొంది.

అంతేకాకుండా నాయకులు, అభ్యర్థులు ప్రచారంలో తమ బిడ్డను ఒడిలో పెట్టుకుని, వాహనంలోనూ, ర్యాలీల్లోనూ పిల్లలను ఏ విధంగానూ ఉపయోగించుకోకూడదని కమిషన్ పేర్కొంది. కవిత్వం, పాటలు, మాట్లాడే పదాలు, రాజకీయ పార్టీ లేదా అభ్యర్థుల చిహ్నాల ప్రదర్శనతో సహా ఏ రూపంలోనైనా రాజకీయ ప్రచారానికి పిల్లలను ఉపయోగించడంపై కూడా నిషేధం వర్తిస్తుంది అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని నాయకుడు, తన తల్లిదండ్రులు సంరక్షకుడి దగ్గర ఉన్నట్లయితే.. అది మార్గదర్శకాల ఉల్లంఘనగా పరిగణించబడదని కమిషన్ తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌లో కీలకమైన వాటాదారులుగా రాజకీయ పార్టీల ముఖ్యమైన పాత్రను నిరంతరం నొక్కిచెప్పారు. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement