Friday, April 26, 2024

New Parliament – వారికి రాష్ట్రపతి – ఈయ‌న‌కు స్పీక‌ర్

న్యూఢిల్లీ – పార్లమెంట్ కొత్త భ‌వ‌నం ప్రారంభోత్సం ఈ నెల 28వ తేదిన ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా జ‌ర‌గ‌నుంది.. అయితే ప్ర‌ధాని ప్రారంభోత్సం చేయ‌డం ఏమిటంటూ కాంగ్రెస్ తో స‌హా 19 విప‌క్ష పార్టీలు మండిప‌డుతున్నాయి..భారతదేశ నూతన పార్లమెంటు భవన సముదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభోత్సవం చేయించకపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఇది దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడమేనని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కనీసం ఆహ్వానించకపోవడం కూడా అవమానకరం అని పేర్కొన్నారు. పార్లమెంటు భవనం అహంకారం అనే ఇటుకలతో నిర్మితం కాలేదని, రాజ్యాంగ విలువలతో నిర్మితమైందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అలాగే విప‌క్ష నేత‌లు సైతం రాష్ట్ర‌ప‌తితోనే ప్రారంభించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.. ఇక ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు..నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. పార్లమెంటుపై స్పీకర్ కే సర్వాధికారాలు ఉంటాయని, కొత్త పార్లమెంటు భవనాన్ని స్పీకర్ ప్రారంభించాలని తెలిపారు. కొత్త పార్లమెంటును స్పీకర్ ప్రారంభిస్తేనే తాను పాల్గొంటానని ఒవైసీ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement