Wednesday, May 1, 2024

తెలుగులో వస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ

ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్‌ చేయడం ‘ఆహా’ ఓటీటీలో ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే ఈ యాప్ లో విడుదలైన మలయాళ డబ్బింగ్ సినిమాలు మంచి ఆదరణ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ‘కాలా’ అనే మరో మలయాళ డబ్బింగ్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు.

‘మారి-2’, ‘లూసిఫర్’, ‘ఫోరెన్సిక్’, ‘మయానది’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ హీరో టోవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కాలా’. ఈ సినిమా మార్చి 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రోహిత్ వి. ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇగో – హింస – ప్రతీకారం అనే అంశాలతో మనుషులకు, జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించారు. ‘ఆహా’ ఓటీటీలో తెలుగులో జూన్ 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో టోవినో థామస్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement