Friday, April 19, 2024

Tech Update | వాట్సాప్‌లో కొత్త పీచ‌ర్‌.. మెస్సేజ్‌లో త‌ప్పుల‌ను ఎడిట్ చేయొచ్చు!

వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. చాలా కాలంగా వాట్సాప్ సంస్థ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్న‌ప్ప‌టికీ రిలీజ్ చేయ‌డంలో కాస్త ఆల‌స్యం అయిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. చాలారోజులుగా ఎదురుచూస్తున్న ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను వాట్సాప్ ఎట్ట‌కేల‌కు తీసుకొచ్చింది. సాధారణ యూజర్లందరికీ ఈ ఫీచర్ రోల్అవుట్‍ను వాట్సాప్ మొదలుపెట్టింది. రానున్న కొన్ని వారాల్లో అందరికీ ఈ ఎడిట్ ఫీచర్ యాడ్ అవుతుందని వాట్సాప్ అధికారికంగా వెల్లడించింది.

ఈ ఫీచర్ ద్వారా.. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా 15 నిమిషాల్లోగా దాన్ని ఎడిట్ చేయవచ్చు. ఏదైనా తప్పు ఉంటే మెసెజ్ డెలివరీ అయిన 15 నిమిషాల్లోగా సరిదిద్దవచ్చు. అంటే మెసేజ్‍ను సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చన్న మాట. ఇటీవల వాట్సాప్ బీటా యూజర్లకు టెస్టింగ్ కోసం ఎడిట్ మెసేజ్ ఫీచర్ రాగా.. ఇప్పుడు సాధారణ యూజర్లకు రోల్అవుట్ మొదలుపెట్టింది వాట్సాప్. పూర్తి వివరాలు ఇవే.

- Advertisement -

ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది?

ప్రస్తుతం వాట్సాప్‍లో సెండ్ చేసిన మెసేజ్‍లో ఏదైనా తప్పు ఉంటే.. ఆ మెసేజ్‍ను డిలీట్ చేసి మళ్లీ పంపడమో.. లేకపోతే తప్పు ఉందని తెలియజేయడమే చేయాల్సి వస్తోంది. అయితే, ఎడిట్ మెసేజ్ ఫీచర్ రావటంతో మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా సరిదిద్దవచ్చు. మెసేజ్ డెలివరీ అయిన 15 నిమిషాలలోగా ఎడిట్ చేయవచ్చు. మెసేజ్ కింద ఎడిటెడ్ అని కనిపిస్తుంది. ఎడిట్ మెసేజ్ ఫీచర్ ప్రస్తుతం టెక్స్ట్ మెసేజ్‍లకు అందుబాటులో ఉంది. ఫొటోలు, వీడియోలు, ఇతర మీడియా టైప్‍లు, క్యాప్షన్‍లను సెండ్ చేసిన తర్వాత ఎడిట్ చేయలేం. అయితే, టెక్స్ట్ మెసేజ్‍లను మాత్రం సెండ్ చేసిన 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement