Wednesday, May 1, 2024

మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు

రానున్న పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కార్ల కంపెనీలు తమ కొత్త మోడల్స్‌ను ఈ నెలలో మార్కెట్‌లోకి తీసుకు రానున్నాయి. సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లలో ఎస్‌యూవీలు, ఎలక్ట్రికల్‌ కార్లు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న కొన్ని మోడల్స్‌లో ఆధునీకరించినవి మళ్లి రానున్నాయి.

టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైరడెర్‌

టాయోటా అర్బన్‌ క్రూయిజర్‌ను సెప్టెంబర్‌ మొదటి వారంలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. దీనికి ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. అర్బన్‌ క్యూయి జర్‌ హైరడెర్‌ ప్రధానంగా 1.5 లీటర్‌ పెట్రోల్‌ హైబ్రీడ్‌ ఇంజ న్‌తో వస్తుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ తోనూ, 6 స్పీడ్‌ ఏటీ, ఏడబ్ల్యూడి ఆఫ్షన్‌తో లభిస్తుంది.

హుడ్యాయ్‌ వెన్యూ ఎన్‌లైన్‌

హుడ్యాయ్‌ వెన్యూ ఎన్‌లైన్‌ ఈ నెల 6న మార్కెట్‌కి వస్తుంది. ఈ కారు బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. 1.0 టర్భో పెట్రోల్‌ ఇంజన్‌తో ఇది లభిస్తుంది. 7 స్పీడ్‌ డీసీటీతో లభిస్తుంది. ఇప్పటికే ఈ కారు రెగ్యులర్‌ మోడల్‌ మార్కెట్‌లో ఉంది. ఇన్‌సైడ్‌లో పలు మార్పులు చేశారు.

- Advertisement -

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ

మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 400 ఆల్‌ న్యూ ఎలక్ట్రిక్‌ కారు ఈ నెల 8న మార్కెట్‌లోకి రానుంది. ప్రపంచ ఈవీ డే రోజున ఈ ఎస్‌యూవీ ని కంపెనీ విడుదల చేస్తోంది. దీని టెక్నికల్‌ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ కారు 4.2 మీటర్ల పొడవు ఉంటుంది. ఒక ఛార్జింగ్‌తో ఇది 350 నుంచి 400 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. మహీంద్రా కంపె నీ వస్తున్న తొలి ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ కారు ఇది.

సిట్రోయెన్‌సీ-5 ఏయిర్‌క్రాస్‌

ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న కారు. దీనిలో పలు మార్పులు చేసిన కంపెనే ఈ నెలలోనే మార్కెట్‌లోకి తీసుకు వస్తోంది. సిట్రోయెన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌ సరికొత్త లుక్‌ తో అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది. ఇది 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 8 స్పీడ్‌ ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

మారుతి సుజుకీ గ్రాండ్‌ విటారా

మారుతి సుజుకీ కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్కెట్‌లోకి తీసుకు వస్తున్న ఎస్‌యూవీ ఇది. రెండు ఇంజన్ల ఆఫ్షన్‌తో గ్రాండ్‌ విటారా అభిస్తుంది. ఇది 1.5 లీటర్‌ స్ట్రాంగ్‌ హైబ్రీడ్‌ పెట్రోల్‌ ఇంజన్‌తోనూ, 1.5 మైల్డ్‌ హైబ్రీడ్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో లభిస్తుంది. 5 స్పీడ్‌ ఎంటీ, 6 స్పీడ్‌ ఏటీ, ఏడబ్ల్యూడీతో లభిస్తుంది. ఈ నెలలోనే ఈ కారు అందుబాటులోకి రానుంది.

ఎంజీ హెక్టర్‌

ఎంజీ కంపెనీ అడ్వాన్స్‌డ్‌ ఎంజీ హెక్టర్‌ను మార్కెట్‌లోకి తీసుకు వస్తుంది. ఇది అత్యాధునిక టెక్నాలజీతో రానుంది. ప్రస్తుతం ఉన్న హెక్టర్‌ను కూడా కంపెనీ మార్కెట్‌లో ఉంచనుంది. ఇందులో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్‌ ఆఫ్షన్‌తో లభిస్తుంది.

మహీంద్రా ఎక్సయూవీ300

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఈ కారులో పలు మార్పులు చేశారు. ఇప్పటికే ఈ కారు గురించి కంపెనీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసింది. ఎక్స్‌యూవీ 300 ఫేస్‌లిఫ్ట్‌ కారులో ఆధునిక హంగులు ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇది 130 బీహెచ్‌పీ, 1.2 లీటర్ల డైరెక్ట్‌ ఇంజక్షన్‌ టర్భో పెట్రోల్‌ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇందులో 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఉంటుంది.

మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈక్యూఎస్‌580

లగ్జరీ మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈక్యూఎస్‌ 580 ఎలక్ట్రిక్‌ కారు ఈ నెల 21న మార్కెట్‌లోకి రానుంది. ఇందులో డ్యూయల్‌ మోటర్స్‌ ఉంటాయి. 4 మ్యాటిక్‌ ఆల్‌ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది. ఈ కారులో 107.8 కిలోవాట్స్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ సారి ఛార్జ్‌ చేస్తే 770 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇవి ఈ సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి రానున్న కార్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement