Saturday, April 27, 2024

వ‌ర్కౌట్స్ చేస్తున్న ఫొటోని పోస్ట్ చేసిన కేటీఆర్.. సినిమాలో న‌టించ‌మంటోన్న నెటిజ‌న్స్

సోష‌ల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్ట‌ర్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన సాయం చేస్తూ ఉంటారు. ప్రజల సమస్యలు తీర్చడమే కాదు ఆయన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ పోస్ట్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కేటీఆర్ ఇంట్లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేటీఆర్ ఇలా వర్కౌట్స్ చేస్తూ చెమట్లు చిందిస్తున్న ఫోటోను షేర్ చేయగా చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు సూపర్ సార్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు సార్ మీరు సినిమాల్లోకి రావాలి.. ఒక యాక్షన్ సినిమాలో నటించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ అయితే మరో అడుగు ముందుకేసి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ చేయండి సార్ అంటూ కామెంట్స్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement