Saturday, May 18, 2024

NEET : నేడు నీట్ 2024 ప‌రీక్ష‌…. రాయనున్న 24 ల‌క్ష‌ల మంది విద్యార్థులు

దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షను ఇవాళ నిర్వ‌హించ‌నున్నారు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది.

- Advertisement -

ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా, ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్,పేపర్ విధానంలో నిర్వహించ‌నున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిన్నారు.

ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన ప‌రీక్షా కేంద్రాల‌లోకి అనుమ‌తించ‌బోరు..ఇక అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకురావలసి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement