Saturday, May 18, 2024

వరల్డ్‌ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు నీరజ్‌ నాయకత్వం.. 28 మందితో జట్టు ప్ర‌క‌ట‌న

ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత బృందానికి ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రా నాయకత్వం వహించనున్నాడు. ఆగస్టు 19 నుంచి హంగేరిలోని బుడాపెస్ట్‌ వేదికగా ప్రారంభం కానున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షి కోసం భారత అథ్లెటిక్స్‌ సమఖ్య 28 మందితో కూడిన జట్టును ప్రకటించింది. భారత అథ్లెట్ల బృంధాన్ని మరోసారి స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ముందుండి నడిపించనున్నాడు.

మహిళల విభాగం: జ్యోతి యర్రాజీ (100మీ హార్డల్స్‌, పారుల్‌ చౌదరీ (3000మీ స్టీప్లే చేస్‌), షైలీ సింగ్‌ (లాంగ్‌ జంప్‌), అన్నురాణి (జావెలిన్‌ త్రో), భావన జట్‌ (20కీ.మీ. వాక్‌).

పురుషుల విభాగం: క్రిష్ణకుమార్‌ (800మీ), అజయ్‌ కుమార్‌ సరూజ్‌ (1500మీ), సంతోష్‌ కుమార్‌ తమిళశరణ్‌ (400మీ హార్డల్స్‌), అవినాష్‌ ముకుంద్‌ సబ్లే (3000మీ స్టీప్లే చేస్‌), సర్వేశ్‌ అనీల్‌ కుశరే (హై జంప్‌), ఎమ్‌ శ్రీశంకర్‌ (లాంగ్‌ జంప్‌), జెస్విన్‌ అల్‌డ్రీన్‌ (లాంగ్‌ జంప్‌), ప్రవీన్‌ చిత్రవెల్‌ (ట్రిపుల్‌ జంప్‌), అబ్దుల్లా అబూబకర్‌ (ట్రిపుల్‌ జంప్‌), ఎల్దోస్‌ పాల్‌ (ట్రిపుల్‌ జంప్‌), నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో), కిషోర్‌ కుమార్‌ జెనా (జావెలిన్‌ త్రో), అకాశ్‌దీప్‌ సింగ్‌ (20కీ.మీ. రేస్‌ వాక్‌), వికాష్‌ సింగ్‌ (20కీ.మీ. రేస్‌ వాక్‌, పరమ్‌జీత్‌ (20కీ.మీ. రేస్‌ వాక్‌), రామ్‌ బాబు (35కీ.మీ. రేస్‌ వాక్‌), అమోజ్‌ జాకబ్‌, మొహమ్మద్‌ అజ్మల్‌, మహ్మద్‌ అనస్‌, రాజేశ్‌ రమేశ్‌, అనిల్‌ రాజలింగమ్‌, మిజో చక్కొ కురైన్‌ (పురుషుల 4– 400మీ రిలే).

Advertisement

తాజా వార్తలు

Advertisement