Friday, May 3, 2024

వైస్ కెప్టెన్‌గా సిద్దూ..!

కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూకు పంజాబ్ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించనుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ముందస్తుగానే ప్రణాళికలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్దూకు కొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. దీంతో వీరిద్దరి వైరం ఎన్నికల మీద పడకుండా ఉండేందుకు అధిష్టానం ఈ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. దాంట్లో భాగంగానే సిద్దూకు సీఎం పదవి ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీఎంతో విభేదాలు తార స్థాయికి చేరుకోవడంతో జూలై 2019 న కేబినెట్ నుంచి వైదొలిగారు సిద్దూ. ఆ తర్వాత కేబినెట్‌లో చేరాల్సిందిగా, విద్యుత్ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సీఎం అమరీందర్ సింగ్ పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశారు. సిద్దూ ససేమిరా అంగీకరించలేదు. తనకు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పీసీసీ పదవి కూడా కావాలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల ముందు లుకలుకలు ఉంటే పార్టీకి నష్టం చేకురుస్తుందని భావించిన కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్‌ను పంజాబ్ కు పంపింది. వీరిద్దరి మధ్య సఖ్యత కుదుర్చే బాధ్యతను ఆయన భుజ స్కంధాలపై మోపింది. ఈ క్రమంలోనే సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. చూడాలి మరీ సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి అప్పగిస్తే అమరీందర్ సింగ్ ఎలా రియాక్ట్ అవుతారో..

Advertisement

తాజా వార్తలు

Advertisement