Tuesday, April 23, 2024

National – జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం – 12 మంది దుర్మరణం

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. రైల్లో మంటలు చెలరేగడంతో భయాందోళనతో ప్రయాణికులు కిందకు దూకేశారు.అదే సమయంలో ఝఝా-అసన్సోల్ రైలు ఎదురుగా వస్తోంది. దీంతో ఆ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు

ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళాఝారియా రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అసాన్సోల్‌-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement