Wednesday, April 24, 2024

AP మక్కెలిరగ్గొట్టిమడత మంచంలో పెడతాం – పవన్ కళ్యాణ్

తాడేపల్లిగూడెం – వైసీపీ గూండాలకు జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ సీరియస్​ వార్నింగ్​ ఇచ్చారు. ప్రజలపై కానీ, తమ కార్యకర్తలపై కానీ ఈగ వాలినా ఊరుకోబోమన్నారు. మక్కెలిరగగొట్టి మడత మంచంలో పెడతామన్నారు. మట్లాడితే వైసీపీ అధినేత జగన్​ నేను ఒక్కడినే అంటాడు. కానీ, మాకున్న ఒక్క ఎమ్మెల్యేనీ వారి పార్టీలో కలుపుకున్న నీదో రాజకీయమా అంటూ మండిపడ్డారు. వ్యక్తి ప్రయోజనాలను ఆశించి తానెప్పుడూ రాజకీయం చేయలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికే పొత్తు పెట్టుకున్నామని పవన్​ స్పష్టం చేశారు..

సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని తాడేపల్లిగూడెం సభలో టీడీపీ-జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి ఉందన్నారు. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ ఐదుగురే పంచాయితీ చేస్తున్నారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవు . జూబ్లీహిల్స్‌ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నప్పట్నుంచి జగన్‌ బతుకు నాకు తెలుసని అన్నారు. జగన్‌ ఇప్పటి వరకూ పవన్‌ తాలూకా శాంతినే చూశావు. 4 దశాబ్దాల రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసింది. అందుకోసమే కూటమిని నేనే ప్రతిపాదించానని తెలిపారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అన్నారు. నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు, రాష్ట్ర లబ్ధికోసమే ఉంటాయన్నారు. టీడీపీ-జనసేన సహకరించుకుంటూనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు. కోట్లు సంపాదించే స్కిల్స్‌ ఉన్నా అన్నీ కాదనుకొని వచ్చానని.. సినిమాల్లో వచ్చే డబ్బును ఇంట్లో బియ్యం కొనకుండా హెలికాప్టర్లకు వెచ్చిస్తున్నానని పేర్కొన్నారు

“జగన్ కు సంబంధించినంత వరకు పవన్ కల్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు. అతడి దృష్టిలో నాలుగు పెళ్లిళ్లు అంటాడు. మరి ఆ నాలుగో పెళ్లాం ఎవరో తెలీదు… మరి అది జగనేమో నాకు తెలియదు. నాకు ఇదే విసుగొస్తోంది జగన్! లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే… రా జగన్ రా! భారతీ మేడం గారూ మీకు కూడా చెబుతున్నాను… మేం ఎప్పుడయినా సరే మిమ్మల్ని మేడం భారతి గారూ అని గౌరవంగా మాట్లాడతాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా గానీ, చంద్రబాబు అర్ధాంగిని మాట్లాడినా కానీ, నా భార్యను అన్నా కానీ మేం మిమ్మల్ని ఏమీ అనలేదు. పెళ్లాలు, పెళ్లాలు అంటాడు… ఆ మాట మేం మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారూ… ఒక్కసారి ఆలోచించండి. నేనేమీ ఇంగ్లీషు మీడియాలో చదువుకున్న వాడ్ని కాను. నాక్కూడా భాష వచ్చు… నేనూ మాట్లాడగలను” అంటూ పవన్ హెచ్చరించారు.

క్లేమోర్ మైన్లు పేలినా, పేలుడు ధాటికి వాహనం 16 అడుగుల ఎత్తుకు ఎగిసి కిందపడినా… చొక్కా దులుపుకుని ఇవతలికి వచ్చేసిన దురంధరుడు చంద్రబాబు అని జనసేనాని పవన్ కల్యాణ్ కీర్తించారు. ఇప్పుడు తాము అటువంటి గొప్ప నేతతో కలిసి నడుస్తున్నామని అన్నారు.

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని, నవ నగర నిర్మాణం చేయగలరని వివరించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడు అనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

- Advertisement -

“నా తపన మీరు బాగుండాలనే… అయితే యుద్ధ తంత్రం గురించి, పోల్ మేనేజ్ మెంట్ గురించి మీకేం తెలుసు? అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా? మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అందుకే 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు ఒప్పుకోవాల్సి వచ్చింది” అని పవన్ కల్యాణ్ వివరించారు.

నన్ను నమ్మండి… వ్యూహం నాకు వదిలేయండి… నేను మీకోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు. నన్ను నమ్మి నడుస్తున్న జనసైనికులు, వీర మహిళలు, యువత… నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును నమ్మి నడుస్తున్న తెలుగు తమ్ముళ్లు, తెలుగు మహిళలు అందరూ కలిసి మహా యుద్ధంలో పాల్గొందాం… ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నాను అని పవన్ పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement