Friday, April 26, 2024

పుట్టిన రోజు కానుక‌…..

నేచురల్‌ స్టార్‌ నాని, దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ కలయికలో వస్తున్న శ్యామ్‌ సింగ రాయ్‌. ఒక విలక్షణ కథతో తీస్తున్న ఈ సినిమాలో ఇదివరకెన్నడూ కనిపించని గెటప్‌లో నాని కనిపించబోతున్నారు.
సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ లాంటి ముగ్గురు హీరోయిన్స్‌ నటిస్తోన్న ఈ సిని మాను వెంకట్‌ ఎస్‌. బోయనపల్లి నిర్మిస్తున్నారు. బుధవారం హీరో నాని పుట్టినరోజు పురస్కరిం చుకొని చిత్ర బృందం శ్యామ్‌ సింగ రాయ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో ఒ క బెంగాలీ యువకుని గెటప్‌లో నాని కనిపిస్తున్నారు. ఆయన మీసకట్టు-, హెయిర్‌ ్టసల్‌ విలక్షణంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్‌లో రాయల్‌ ప్రెస్‌, పక్కనే రిక్షా బండిని చూస్తుంటే ఈ మూవీ ఒక పీరియడ్‌ డ్రామా అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గమనించదగ్గ విషయమేమంటే నానిని వెనక నుంచి ఒక యువతి గట్టిగా కౌగలించుకుంది కానీ, ఆమె ముఖం అసలు కనిపించడం లేదు. ముగ్గురు హీరోయిన్లలో ఎవరు ఆయనను కౌగలించుకున్నారనే విషయాన్ని ఊహలకి వదిలేశాడు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ కోల్‌కతాలో జరుగుతోంది. ఈ భారీ షెడ్యూల్‌లో హీరో, ముగ్గురు హీరోయిన్లు సహా ప్రధాన తారాగణమంతా పాల్గొంటు-న్నారు. అక్కడ పలు కీలక సన్నివేశాలను తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement