Friday, April 19, 2024

‘తలైవి’ టీజర్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయన్ తెరకెక్కిస్తున్న చిత్రం తలైవి.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జయలలిత నట జీవితం, రాజకీయ జీవితాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. జయలలిత జన్మదినోత్సవం సందర్భంగా  చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 23న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు కంగన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో కంగనతోపాటు అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement