Monday, May 6, 2024

నాందేడ్ లో హింస.. రక్తసిక్తమైన గురుద్వారా!

మహారాష్ట్రలోని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రజలు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన వేళ.. నాందేడ్ లోని గురుద్వారా వద్ద వందలాది మంది చేరారు. వారిని పోలీసులు అడ్డగించిన వేళ, సిక్కు నిరసనకారులు కొందరు కత్తులు చేతపట్టి, పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసుల వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు.

కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుండటంతో మహమ్మారి నియంత్రణకు ఊరేగింపులు, వేడుకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాందేడ్ గురుద్వారా వద్ద ‘హోలా మహోల్లా’ ఊరేగింపునకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే, ఆంక్షలను బేఖాతరు చేస్తూ భారీగా చేరుకున్న కొందరు యువకులు.. కత్తులు తిప్పుతు ఊరేగింపునకు ప్రయత్నించారు. సంప్రదాయ హోలా మహోల్లా ఉత్సవాన్ని నిర్వహించి, సిక్కు మార్షల్ నైపుణ్యాలను ప్రదర్శించారు.

ఈ సందర్బంగా యువకులను అడ్డుకోడానికి ప్రయత్నించి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో నలుగురు పోలీసుల గాయపడగా, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement