Monday, April 29, 2024

సాగర్ ఉప ఎన్నిక బిజెపి స్టార్ కాంపెయినర్స్ వీరే

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచి అభ్యర్థి విషయంలో సందిగ్ధతను కొనసాగిస్తున్న బీజేపీ స్టార్ కాంపై నర్స్ జాబితాను ఆదివారం విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు 30 మంది పేర్లను ప్రకటించింది. జాబితాలో సంజయ్ తో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీమోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్,
పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ ప్రత్యేక ఆహ్వానితులు నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘు నందరావు, మాజీ ఎమ్మెల్సీ .రాంచందర్ రావు, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహనరావు, వివేక్ వెంకటస్వామి, విజయశంతి, చాడా సురేష్ రెడ్డి, డి. రవీంద్ర నాయక్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మినారాయణ, ధర్మారావు, ఎం. విజయపాల్ రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రులు ఈ పెద్ది రెడ్డి, మోత్కుపల్లి నర్సింలు, బాబూమోహన్, చంద్రశేఖర్, పార్టీ సంస్థాగతరాష్ట్ర ప్రధానకార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement