Sunday, April 28, 2024

నా భ‌ర్త బంగారం.. యాంక‌ర్ లాస్య‌

త‌న భ‌ర్త మంజునాథ్ పై పొగ‌డ్త‌లు కురిపించింది న‌టి..యాంక‌ర్ లాస్య‌.కాగా లాస్య రెండోసారి తల్లయ్యారు. నిండు గర్భిణిగా ఉన్న లాస్యకు త్వరలో ప్రసవం కానుంది. ప్రెగ్నెంట్ పీరియడ్ ఆడవాళ్ళకు మరో జన్మతో సమానం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ కారణంగా పెరిగిన పొట్ట ఏ పనీ సులభంగా చేసుకోనివ్వదు. కూర్చోవడం, పడుకోవడం, నడవడం కూడా కష్టమే. గర్భవతిగా తన ఇబ్బందులు తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేసింది. అలాగే భర్త మంజునాథ్ ఎలా దగ్గరుండి చూసుకుంటున్నారో ఆ వీడియోలో తెలియజేశారు. అమ్మలా చూసుకునే భర్త ఉండగా తనకు ఎంత కష్టమొచ్చినా ఎదుర్కోగలని లాస్య పరోక్షంగా తెలియజేశారు. ఇటీవల లాస్య సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement