Saturday, July 13, 2024

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సంగీత దర్శకుడు థమన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు థమన్‌ జూబ్లిdహిల్స్‌ జిహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కను నాటి ఒక ప్రాణం పోసినంత అనుభూతి తనకు కలిగిందన్నారు. ఇప్పటి వరకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా 16 కోట్లకు పైగా మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్‌ లాంటి కాంక్రీట్‌ జంగల్‌లో పచ్చదనం పెంపుకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కృషి అభినందనీయమన్నారు. గ్రో గ్రీనరీ ఇండియా కోసం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేపట్టిన కార్యక్రమాలు మరింత విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతమంచి కార్యక్రమంలో తనకు పాల్గొనే అవకాశం కల్పించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ రూపకర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement