Tuesday, April 23, 2024

ప్రధాని మోదీ ఆస్తులు పెరిగాయా, తగ్గాయా? అసలు ఆస్తుల విలువ ఎంతంటే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాదాపు రూ. 2.23 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇవన్నీ చాలా మటుకు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. కానీ, గాంధీనగర్‌లోని కొంత భూమిలో తన వాటాను విరాళంగా ఇచ్చినందున స్థిరాస్తులు లేవని ఆయన తాజా ఆస్తుల గురించి వెల్లడించారు. మార్చి 31 వరకు అప్‌డేట్ చేసిన అతని డిక్లరేషన్ ప్రకారం అతనికి ఎటువంటి బాండ్, షేర్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి లేదు. ఏ వాహనం సొంతంగా లేదు. అయితే రూ. 1.73 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్టు తన డిక్లరేషన్​లో మోదీ పేర్కొన్నారు.

మోదీ చరాస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ. 26.13 లక్షలు పెరిగాయి. అయితే మార్చి 31, 2021 నాటికి రూ. 1.1 కోట్ల విలువైన స్థిరాస్తులు ఆయన వద్ద లేవు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం.. మార్చి 31, 2022 నాటికి ప్రధాని మోదీ ఆస్తులు మొత్తం రూ. 2 కోట్ల23లక్ష 82వేల504 రూపాయలుగా ఉంది.

ఇక.. మోదీ మరో ముగ్గురు యజమానులతో కలిసి ఉమ్మడిగా కలిగి ఉన్న నివాస ప్లాట్‌ను, ఒక్కొక్కరికి సమాన వాటా ఉంది.  గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అక్టోబర్ 2002లో దీన్ని కొనుగోలు చేశారు. తాజా అప్‌డేట్‌లో “స్థరాస్తుల సర్వే నెం. 401/A మరో ముగ్గురు జాయింట్ ఓనర్‌లతో సంయుక్తంగా నిర్వహించబడింది. ప్రతి ఒక్కరికి దానిలో 25 శాతం సమాన వాటా ఉంటుంది. అయితే అది కూడా విరాళంగా ఇచ్చినట్టు అఫిడవిట్​లో తెలిపారు.

కాగా, మార్చి 31, 2022 నాటికి ప్రధాని చేతిలో ఉన్న నగదు రూ. 35,250. పోస్టాఫీసులో అతని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల విలువ రూ. 9,05,105, రూ. 1,89,305 విలువైన జీవిత బీమా పాలసీలున్నాయి. తమ ఆస్తులను ప్రకటించిన ప్రధానమంత్రి కేబినెట్ సహచరులలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్ద మార్చి 31, 2022 నాటికి రూ. 2.54 కోట్ల విలువైన చరాస్తులు, 2.97 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి.

మొత్తం 29 మంది కేబినెట్ మంత్రుల్లో గత ఆర్థిక సంవత్సరంలో తమ సొంత, వారిపై ఆధారపడిన వారి ఆస్తులను ప్రకటించిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్ కే సింగ్, హర్దీప్ సింగ్ పూరి, పర్షోత్తమ్ రూపాలా, జి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేబినెట్ మంత్రిగా పనిచేసి, జులైలో పదవి నుంచి వైదొలిగిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా తన ఆస్తులను ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement