Sunday, May 5, 2024

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో రెండోస్థానంలో.. ముంబయి

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో రెండోస్థానంలో ఉంది ముంబయి. ఈ విషయంలో రాజధాని ఢిల్లీని వెనక్కినెట్టింది.. చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలు ఈ పరిస్థితికి కారణమని వెల్లడించారు. లా నినా సైక్లోన్ ఎఫెక్ట్ తో గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని పేర్కొన్నారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 తేదీల మధ్య కాలానికి నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారుచేసింది. ఇందుకోసం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి సమాచారం సేకరించినట్లు ఐక్యూ ఎయిర్ తెలిపింది. గతేడాది నవంబర్ తో పాటు ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైలో గాలి నాణ్యత ఎక్కువగా ‘పూర్’, ‘వెరీ పూర్’ కేటగిరీలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, రోడ్లపై ఎగిసిపడే దుమ్ముధూళి వల్ల గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement