Saturday, May 18, 2024

బోల్డ్ లుక్ లో షమీ భార్య.. నెటిజన్ల ఫైర్

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు లక్షమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే హసీన్ జహాన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వివాదంగా మారింది. రగ్గడ్ జీన్స్, బ్లాక్ టాప్‌తో ఉన్న ఫొటోను హసీన్ జహాన్ పోస్ట్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఫొటో కాస్తంత బోల్డ్‌గా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వివాహమై ఓ బిడ్డకు తల్లివి కూడా అయిన తర్వాత కూడా ఇంత బోల్డ్‌గా కనిపించడం అంత అవసరమా? అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. మరికొందరేమో బ్యూటిఫుల్ లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 7 ఏప్రిల్ 2014న వివాహం చేసుకున్న షమీ, హసీన్‌ల కాపురంలో ఆ తర్వాత కలతలు రేగాయి. ప్రస్తుతం వీరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, విడాకులు మాత్రం తీసుకోలేదు. షమీకి మరో మహిళతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని హాసన్ ఆరోపించినప్పటికీ నిరూపించలేకపోయింది. కోల్‌కతాకు చెందిన హసీన్ మోడల్ కూడా.

ఇది కూడా చదవండి: t20 world cup: ఆస్ట్రేలియా జట్టు ఇదే..

Advertisement

తాజా వార్తలు

Advertisement