Monday, April 29, 2024

జూమ్ కాల్ లో నగ్నంగా నిలబడిన ఎంపీ..

ఈ కరోనా పుణ్యమా అని.. హోటల్స్, హాస్పిటల్స్ అయ్యాయి.. ఇల్లు ఆఫీస్ అయ్యింది. కరోనా నేపథ్యంలో కెనడలో ఎంపీ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాడు. అయితే మర్చిపోయాడేమో ఏమో కాని జూమ్ కాల్ లో నగ్నంగా కనపడి అందరిని షాక్ కి గురిచేశాడు. ప్రస్తుతం కెనడాలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఆ సమావేశాలను జూమ్ కాల్ లో ఏర్పాటు చేశారు. అందరు సమావేశంలో పాల్గొని సమీక్ష జరుపుతుండగా కెనడా పార్లమెంట్‌ కు చెందిన ఎంపీ విలియమ్ ఆమోస్ నగ్నంగా కనిపించాడు.

ఈ అనుకోని సంఘటనతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా షాక్ అయ్యారు. ఈ విషయమై ఎంపీ వివరణ ఇచ్చారు. తానూ పొద్దునే జాగింగ్ కి వెళ్లానని, వచ్చేసరికి ఆలస్యమైందని, సమావేశానికి లేట్ అవుతుందేమోనని కాల్ కనెక్ట్ చేసి డ్రెస్ మార్చుకోబోయానని తెలిపారు. అంతలోనే కాల్ కనెక్ట్ అవ్వడంతో ఈ పొరబాటు జరిగిందని వివరించారు. తప్పు ఎవరిది అయినా పాపం ఎంపీ పరువు మాత్రం గంగలో కలిసిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ముందు వెనకా చూసుకోబడలా ఎంపీ గారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement