Tuesday, May 7, 2024

ధవళేశ్వరం బ్యారేజ్ సామర్థ్యం పెంచాలని ప్రస్తావించిన ఎంపీ భరత్.. పరిశీలిస్తామన్న కేంద్ర మంత్రి షెకావత్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతున్న నేపథ్యంలో ఆ కింద ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ సామర్థ్యాన్ని పెంచాలని రాజమహేంద్రవరం ఎంపీ (వైఎస్సార్సీపీ) మార్గాని భరత్ గురువారం లోక్‌సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలవరం నుంచి విడుదలయ్యే నీటికి తగిన పరిమాణంలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి విడుదల చేసేలా ఏర్పాట్లు ఉంటాలని ఆయన సూచించారు.

లేనిపక్షంలో వరదలు సంభవించినప్పుడు అంత మొత్తంలో నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ విడుదల చేయలేకపోతే సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఈ క్రమంలో బ్యారేజ్ గేట్ల సంఖ్యను పెంచి, మరింత నీటిని విడుదల చేసేలా సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. లోక్‌సభలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన భరత్‌కు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెంటనే సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు ప్రతిపాదనలు వస్తే తప్పనిసరిగా పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement