Tuesday, May 14, 2024

లెబనాన్‌కు ఆహార ధాన్యాల తరలింపు.. ఉక్రెయిన్‌ నుంచి బయలుదేరిన తొలి నౌక

ఇస్తాంబుల్‌:రష్యా దండయాత్ర నేపథ్యంలో ఉక్రెయిన్‌ పోర్టుల్లో పేరుకుపోయిన ఆహార ధాన్యాలను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఉక్రెయిన్‌లోని ఒడెశా పోర్టునుంచి ఆహార ధాన్యాలతో బయలుదేరిన నౌకను టర్కీలోని ఇస్తాంబుల్‌లోని జాయింట్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌లో బుధవారం తనిఖీలు చేసి పచ్చజెండా ఊపారు. ఐక్యరాజ్యసమితి, టర్కీ, రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. లెబనాన్‌లోని ట్రిపోలీకి రజోని అనే నౌక దాదాపు 26 వల టన్నుల గోధుమ పిండి, బార్లీని తీసుకువెడుతోంది.

కాగా నల్లసముద్రంలోని బోస్‌ఫోరుస్‌ మార్గం ద్వారా రజోనీ నౌక ప్రయాణిస్తుందని టర్కీ రక్షణశాఖ ప్రకటించింది. కాగా రజోనీ నౌకలోని మొక్కజొన్న, బార్లీ, గోధుమ పిండి సహా రవాణా అవుతున్న వస్తువలన్నింటిని తనిఖీ చేశారని ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సాండర్‌ కుబర్‌కోవ్‌ తెలిపారు. సియెర్ర లియోన్‌కు చెందిన కార్గోషిప్‌ రజోని రష్యా దండయాత్ర నేపథ్యంలో ఒడెసా పోర్టులో చిక్కుకుపోయింది. దాదాపు ఐదునెలల తరువాత మళ్లి బయలుదేరింది. మంగళవారం రాత్రి ఇస్తాంబుల్‌లోని జాయింట్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు చేరుకోగా బుధవారం తనిఖీలు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement