Wednesday, May 8, 2024

మోటోరొలా నుంచి ఫ్రంటియర్‌ స్మార్ట్‌ ఫోన్‌.. జులైలో మార్కెట్లోకి..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గంజ మోటోరొలాలో ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లు విడుదల చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోటోరొలా ఫ్రంటియర్‌ పేరుతో మరోకొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నది. ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి మోటోరొలా అధికారికంగా ఎలాంటి ఫీచర్లు ప్రకటించకపోయినప్పటికీ.. కొన్ని ఫీచర్లు లీక్‌ అయ్యాయి. లీక్‌ అయిన‌ సమాచారం మేరకు ఈ స్మార్ట్‌ఫోన్‌లో రానున్న ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ ఫోన్‌లో కెమెరాకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఏకంగా 194 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 60 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నట్టు సమాచారం.

144 హెట్ట్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓఎల్‌డీ డిస్‌ప్లేను అందించనున్నారు. స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 1 అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ చిప్‌సెట్‌తో కూడిన ఎల్‌పీడీడీఆర్‌5 12 జీబ ర్యామ్‌ను అందించనున్నారు. 50 వాట్ల వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 125 వాట్ల వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఈ ఫోన్‌ సొంతం. 4500 ఏంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. వైఫ్‌ 6ఈతో పాటు యూఎస్‌బీ టైప్‌-సీ, బ్లూటూత్‌ వీ5.2 కనెక్టివిటీ ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్‌ 12 మైయూక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ ఫోన్‌ రానుంది. ఈ ఫీచర్లతో కూడిన స్మార్‌ ్ట ఫోన్‌ 2022 జులైలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement