Saturday, September 21, 2024

France Tour – 14, 15 తేదీల‌లో ప్ర‌ధాని మోడీ ఫ్రాన్స్ ప‌ర్య‌ట‌న

న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 14, 15 తేదీల‌లో ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అహ్వానం మేరకు 14న జరిగే బాస్టిల్ డే వేడుకల్లో మోడీ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. మోడీని జులై14 పరేడ్‌కు స్వాగతించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. మేక్రాన్‌ ట్వీట్‌ చేశారు… . ఈ పర్యటనలో ప్రధాని దిగ్గజ సీఈవోలతో సమావేశం అవుతారని , ప్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని విదేశీ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది..

ఫ్రాన్స్‌ పర్యటన ముగిసిన అనంతరం 15న ప్రధాని అబుదాబిలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోడీ చర్చలు జరుపుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement