Saturday, May 4, 2024

ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. హైకోర్టులో అనంతబాబుకు మరోసారి చుక్కెదురైంది. అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్ట్ డిస్మిస్ చేసింది. గతంలో అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయగా… ధర్మాసనం కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేయనందున బెయిల్ ఇవ్వాలని హైకోర్టును అనంత‌బాబు కోరారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement