Sunday, February 25, 2024

Mizoram – ఓటు హక్కును వినియోగించుకున్న గవర్నర్ కంభంపాటి హరిబాబు

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి కిందటే రాజధాని ఐజ్వాల్‌లో ఆయన ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో పోలింగ్ ప్రక్రియను అతిపెద్ద పండగగా అభివర్ణించారు. ఈ పండగలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మిజోరం అక్షరాస్యత అధికంగా ఉన్న ఉన్న రాష్ట్రం అని, తమ హక్కులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. మిజోరాం ప్రజలందరూ ఓటు వేసి ఎన్నికల్లో పాల్గొనాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఓటింగ్ శాతం అధికంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

కాగా ,40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ ముగుస్తుంది. ఎనిమిది లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వారికోసం 1,276 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు అధికారులు. ముఖ్యమంత్రి జోరమ్ థంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజధాని ఐజ్వాల్‌ నార్త్-2 నియోజకవర్గంలోని వైఎంఏ హాల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆయన ఓటు వేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement