Monday, April 29, 2024

Indian Missile | వియత్నాంకు క్షిపణి కానుక.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రకటన

దేశవాళీ పరిజ్ఞానంతో రూపొందిన ‘కొర్‌వెట్టె ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌’ క్షిపణిని వియత్నాంకు కానుకగా భారత్‌ అందిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. సోమవారమిక్కడ వియత్నాం రక్షణ మంత్రి జనరల్‌ ఫాన్‌ వాన్‌ గాంగ్‌తో రాజ్‌నాథ్‌ సింగ్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇదే విషయమై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ”రక్షణ రంగ పరిశ్రమలో సహకారం, సాగర జలాల్లో భద్రత, బహుళజాతి సహకారం, తదితర అంశాల్లో భాగస్వామ్య ప్రాధాన్యతను ఇరువురు మంత్రులు గుర్తించారు.

- Advertisement -

వియత్నాం పీపుల్స్‌ నావికాదళం సామర్థ్యాలను పెంపు చేయడంలో ఒక మైలురాయిగా నిలిచే దేశవాళీ ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌ క్షిపణిని వియత్నాంకు కానుకగా ఇస్తామని రక్షణ మంత్రి ప్రకటించారు” అని సదరు ప్రకటన పేర్కొంది. వియత్నాం రక్షణ మంత్రి రెండు రోజుల పర్యటనలో భాగంగా జూన్‌ 18న భారత్‌ చేరుకున్నారు. భారతదేశపు యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌కు ఒక ముఖ్యమైన భాగస్వామిగా వియత్నాం ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement