Friday, May 3, 2024

సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి పువ్వాడ పాలాభిషేకం

ఖమ్మం : అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించిన నేపధ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడం పట్ల రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం ముమ్మాటికీ “రైతు ప్రభుత్వమే” అంటూ రైతులు నినాదాలు చేశారు. ఇప్పుడిప్పుడే రైతులు నిలదొక్కుకుని స్థిరపడే పరిస్థితికి వస్తున్న క్రమంలో మంచి దిగుబడి వచ్చి అప్పుల నుంచి తేరుకుంటామని భావిస్తున్న తరుణంలో ఆకాల వర్షం రూపంలో రైతులను మళ్లీ అప్పుల ఊభిలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఆదుకుంటుందన్న మాటతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఈ సందర్భంగా ఖమ్మం నగరం 15వ డివిజన్ అల్లిపురంలో రైతుల ఆధ్వర్యంలో మొక్క జొన్న చేలులో రైతులతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్షీరాభిషేకం చేశారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement