Friday, May 3, 2024

8న మంత్రి కేటీఆర్ రాక‌.. ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం ఎనుగల్ గ్రామానికి 8న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో అక్కడ హెలీప్యాడ్, సభాస్థలి, పార్కింగ్ స్థలాలను, ఇతర ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరిశీలించారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయనున్న మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అన్నారు. ఈ స్క్రీనింగ్ ని మహిళలు ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement