Saturday, April 20, 2024

రామగోపాల్ రెడ్డిని గెలిపించండి.. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ బలపరచిన పచ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సోమిశేట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి కోరారు. సోమవారం వారు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం పరిశీలకులు రామాంజినమ్మ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు భీమవరం నాగేశ్వరరావుతో కలిసి కోసిగిలో మండల కన్వీనర్ జ్ఞానేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ బలపరచిన పచ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తల కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఓటర్లతో మాట్లాడుతూ… వైయస్సార్ ప్రభుత్వం యువతకు అనేక హామీలు ఇచ్చి, ఒక్క ఉద్యోగం గాని పరిశ్రమలు గాని ఇవ్వకుండా మోసం చేసిందని, ఈనెల 13వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో త‌మ తెలుగుదేశం పార్టీ బలపరచిన పచ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరద్వాజ్ శెట్టి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, తెలుగు యువత జిల్లా మీడియా కోర్డినేటర్ విజయ రామిరెడ్డి, పంపాపతి, కోండగేని వీరారెడ్డి, సాతూనురు కోసిగయ్య, నాడిగేని వీరారెడ్డి, వడ్డే రామయ్య, లక్ష్మీకాంత్, గోపాల్, డీలర్ నరసన్న, ఈరయ్య, మైనార్టీ నాయకులు ఖలదర్, గౌస్, తెలుగు మహిళ జిల్లా కార్యదర్శి నాడిగేని నర్సమ్మ, చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, జంపాపురం మాజీ సర్పంచ్ క్రిష్ణరెడ్డి, వందగల్ మాజీ సర్పంచ్ నరసింహులు, పల్లేపాడు మాజీ సర్పంచ్ చంద్ర, బెళగల్ సర్పంచ్ రామయ్య, తెలుగు యువత మండల అధ్యక్షులు నాడిగేని మహదేవ్, యస్ సి సెల్ నాయకులు యం పి టి సి సభ్యులు రాజు, మారేప్ప, ఈరేష్, బుడ్డన్న, అంపయ్య, వక్రాని వెంకటేష్, మదిరి వీరారెడ్డి, కందూకురు రామన్న గౌడ్, కురువ అయ్యన్న, ఆర్లబండ సర్పంచ్ మల్లికార్జున, రామంజినేయులు, అయ్యన్న, ఈరయ్య, బసవ, వారం గోపాల్, పెద్ద భూంపల్లి జనార్ధన్, మారెయ్య, అంపయ్య, రామయ్య, ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఉసేని, గుండేష్, గోపాల్, నరసింహ రెడ్డి, లీగల్ సెల్ నాగరాజు, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, భూంపల్లి నీలకంఠ, దుద్ది నాగేష్, అంజినిరెడ్డి, పరుశాయ్ హనుమంతు, దొడ్డయ్య, పెద్ద భూంపల్లి హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement