Sunday, April 28, 2024

చార్‌ధామ్‌ వద్ద వీఐపీ దర్శనానికి కనీస రుసుము

వచ్చే నెలలో ప్రారంభం కానున్న చార్‌ధామ్‌ యాత్రకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యాత్రకు రాష్ట్ర అతిథులు, ప్రముఖుల సౌకర్యార్థం బద్రీ కేదార్‌ ఆలయ కమిటీ నోడల్‌ అధికారులను నియమిస్తోంది. అయితే ఈప్రత్యేక ఏర్పాట్లు ఆలయాన్ని సందర్శించే సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవని ప్రభుత్వం పేర్కొంది. ఈసారి వీఐపీ, వీవీఐపీ యాత్రికులు కేదార్‌నాథ్‌లో దర్శనానికి కనీస రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పోర్టల్‌లు తెరిచిన వెంటనే ఈ సిస్టమ్‌ ప్రారంభమవుతుంది.

బద్రీనాథ్‌ కేదార్‌ ఆలయ కమిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ యోగేంద్ర సింగ్‌ మాట్లాడుతూ, ”శ్రీ బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఏప్రిల్‌ 25 నుండి ప్రారంభమయ్యే కేదార్‌నాథ్‌ యాత్రలో దర్శనానికి మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఇందులోభాగంగా వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక అధికారులను నియమించడంపై చర్చ సాగుతోంది. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement