Monday, April 29, 2024

BholaShankar | మిల్కీ బ్యూటీ, నువ్వేనా స్వీటీ.. అద‌ర‌గొడుతున్న భోళాశంక‌ర్ సాంగ్‌

దర్శకుడు మెహర్ రమేశ్ తో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న‌ మాస్ ఎంటర్టయినర్ మూవీ భోళాశంకర్. తమన్నా హీరోయిన్‌గా .. మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి తాజాగా మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ.. అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను కొద్ది సేప‌టి క్రితం రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మహతి స్వరసాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయ‌గా.. మహతి స్వరసాగర్, విజయ్ ప్రకాశ్, సంజన కల్మాంజే స్వారాలందించారు.

సినిమా అభిమానుల్లో ఉన్న‌ అంచనాలకు తగ్గట్లుగానే.. మేకర్స్ ఈ సినిమాని ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ సినిమా నుండి వరుసగా పాటలను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు భోళా మేనియా, జాం జాం జజ్జనక పాట‌లు రిలీజ్ అయ్యాయి. ఆడియన్స్ నుంచి వీటికి విశేష స్పందన లభిస్తోంది. కాగా ఇవ్వాల రిలీజ్ చేసిన.. మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ పాట కూడా ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ మూవీ వ‌స్తుండ‌టంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.కాగా, ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న భోళాశంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో సుశాంత్, వెన్నెల కిశోర్, తరుణ్ అరోరా, మురళి శర్మ, బ్రహ్మాజీ, శ్రీముఖి, గెటప్ శ్రీను, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement