Thursday, May 16, 2024

ఎంజీ కొత్త కారు జ‌డ్ఎస్ ఈవీ ఫేస్‌లిఫ్ట్

ఎంజీ మోటార్స్ 2022 ఎంజీ జ‌డ్ఎస్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను దేశీయ‌ మార్కెట్‌లో లాంఛ్ చేసింది. ఆస్ట‌ర్ పెట్రోల్ వెర్ష‌న్ డిజైన్‌ను ఈ కొత్త కారు క‌లిగి ఉంది. ఒక్క‌సారి బ్యాట‌రీ చార్జ్ చేస్తే 461 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే కెపాసిటీ ఉంది. ఇక కారు లోప‌ల 7.0 ఇంచ్ ఇనుస్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, మ‌ధ్య‌లో 10.1 ఇంచ్ ఇన్ఫోటెయిన్‌మెంట్ డిస్‌ప్లే క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. క్యాబిన్ లేఅవుట్‌లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, డ్యూయ‌ల్ పేన్ స‌న్‌రూఫ్ వంటి ప‌లు ఫీచ‌ర్ల‌ను జోడించారు.

2022 ఎంజీ జ‌డ్ఎస్ ఈవీలో ఆఫ‌ర్ చేసిన ఐ స్మార్ట్ సిస్టం ద్వారా వెహిక‌ల్ లైవ్ లొకేష‌న్‌ను షేర్ చేసే వెసులుబాటు ఉంది. కాగా.. న్యూ ఎంజీ జ‌డ్ఎస్ ఈవీ భార‌త్‌లో రూ.22 ల‌క్ష‌ల (ఎక్స్‌షోరూం)కు అందుబాటులో ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement