Monday, April 29, 2024

Delhi | మున్సిపాలిటీల్లో కంటోన్మెంట్లు విలీనం…రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉన్న కంటోన్మెంట్లలో సివిల్ ఏరియాను పొరుగునే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం రాజ్యసభలో సీపీఐ (ఎం) ఎంపీ డా. వి. సదాశివన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ప్రాంతాలు, పక్కనే ఉన్న మున్సిపాలిటీల్లో ఏకరూపత తీసుకొచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.

ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ప్రతిపాదనలను ఆయా రాష్ట్రాలకు పంపించినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు ఖాస్ యోల్ కంటోన్మెంట్‌కు చెందిన సివిల్ ఏరియాను 2023 ఏప్రిల్ 27న డీ-నోటిఫై చేశామని తెలిపారు. కంటోన్మెంట్ చట్టం – 2006లోని సెక్షన్ 7 (1) ప్రకారం బోర్డు పరిధిలోని ప్రాంతాలను పొరుగునే ఉన్న స్థానిక మున్సిపాలిటీల్లో విలీనం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని కేంద్ర మంత్రి సమాధానంలో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement