Thursday, April 25, 2024

జగన్ కు థాంక్యూ చెప్పిన మెగాస్టార్

గతేడాది కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడ్డ సంగతి తెలిసిందే. ఈ యేడాది ఆరంభంలో తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మళ్లీ ప్రారంభమైంది. దీంతో మళ్లీ థియేటర్లకు గతేడాది జరిగిన విధంగానే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి థియేటర్లకు రాయితీలు ప్రకటించారు. 2020 ఏప్రిల్ ,మే, జూన్ మాసాలలో థియేటర్స్ చెల్లించాల్సిన పిక్స్ చార్జీల బకాయిలను 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు చెల్లించేలా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల్లో 50 శాతం వరకు వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

కరోనా కాలంలో సినీ ఇండస్ట్రీకి ఉపశమనం కలిగించేలా మీరు తీసుకున్న నిర్ణయం గొప్పది. నీ మద్దతు ఇండస్ట్రీ పై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికులకు, కుటుంబాలకు సహాయపడుతుంది…అంటూ చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement