Saturday, May 11, 2024

అభిమాని చివ‌రికోరిక తీర్చిన – మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమాని కోరిక‌ని నెర‌వేర్చాడు.. చిరంజీవి సోంత ఊరు అయిన మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. రెండు కిడ్నీలు పాడైన ఈయన చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టాడు. ఈ విషయం చిరంజీవి దగ్గరకు చేరింది. ఆయన వెంటనే స్పందించారు. వెంటనే తన అభిమాని కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించాడు. మృత్యువుతో పోరాడుతున్న నాగరాజును చూసి చలించిపోయిన చిరు ఆయన్ను ఆప్యాయంగా హత్తుకున్నాడు. కాసేపు అభిమానితో మాట్లాడి ఆయనకు మానసిక స్థైర్యాన్ని అందించాడు.

అంతేకాక ఆర్థిక సహాయం కూడా కల్పించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవగా చిరు మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేపోతున్నారు నెటిజన్లు.కెరీర్ బిగినింగ్ నుండి కూడా హీరోగా.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. గొప్ప క్రేజ్ అందుకోవడం మాత్రమే కాదు.. సందర్భం ప్రకారం తోటి వారికి సహాయం చేసి గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన మెగాస్టార్ గా ఎదిగి… ఇండస్ట్రీకి ఓ పెద్దగా ఉంటూ.. పరిశ్రమ బాగోగులు చూసుకుంటున్నారు. ఎక్కడ ఏ కష్టమెచ్చినా నేనున్నా అన్న భరోసా ఇస్తున్నారు చిరంజీవి. ఇక రీసెంట్ గా కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఇండస్ట్రీ తరపున నిలిచి కరోనా వెల్ఫేర్ ఫండ్ స్థాపించి అనేకమంది సినీ కార్మికులకు సహాయం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement