Saturday, December 7, 2024

Mega Family Meet – బెంగుళూరులో మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు

మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను ఒక రేంజ్ లో జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరులో ఒక ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతి మొత్తాన్ని బెంగళూరులో జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులందరూ బెంగళూరు చేరుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ సహా వారి పిల్లలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కుమార్తె ఆద్య కూడా ఈ వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మెగా ఫ్యామిలీ రిలీజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది..

దాదాపుగా 40 నుంచి 50 మంది ఈ ఫోటోలో కనిపిస్తున్నా కేవలం సినీ పరిశ్రమకు పరిచయం ఉన్నవారు మాత్రమే కాదు పరిచయం లేని ఇతర మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement