Tuesday, May 21, 2024

క్ల‌బ్ మ‌స్తీ ప‌బ్ లో అర్థ‌న‌గ్న నృత్యాలు – ప‌లువురి అరెస్ట్

క‌స్ట‌మ‌ర్ల కోసం యువ‌తుల‌తో అర్థ‌న‌గ్న నృత్యాలు ఏర్పాటు చేశారు హైద‌రాబాద్ క్ల‌బ్ మ‌స్తీ ప‌బ్ నిర్వాహ‌కులు. మాదాపూర్ ఎస్ ఓటీ పోలీసులు ఈ ప‌బ్ పై దాడులు నిర్వ‌హించారు.పరిమితికి మించి డీజే సౌండ్లతో పబ్ నిర్వహిస్తున్న విషయం కూడా వెల్లడైంది. దాడుల సందర్భంగా 9 మంది యువతులు, పబ్ మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్ ధనరాజ్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పబ్ యజమాని శివప్రసాద్ రెడ్డి, మేనేజర్లు కృష్ణ, విష్ణు పరారయ్యారు. ఈ దాడుల సందర్భంగా పోలీసులు క్లబ్ మస్తీ పబ్ లో డీజే మిక్సర్, హుక్కా ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో అదుపులోకి తీసుకున్నవారిని ఎస్వోటీ పోలీసులు కేపీహెచ్ బీ పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement