Thursday, April 25, 2024

న‌రేశ్‌.. ప‌విత్రాలోకేశ్ ల మ‌ళ్లీ పెళ్లి.. ఫ‌స్ట్ లుక్.. గ్లింప్స్ వీడియో

సీనియ‌ర్ న‌టులు న‌రేశ్.. ప‌విత్రాలోకేశ్ లీడ్ రోల్స్ లో న‌టిస్తోన్న చిత్రం మ‌ళ్లీ పెళ్లి. మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు.పవిత్రా లోకేశ్‌ ముసిముసిగా నవ్వుతూ ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే.. నరేశ్‌ చిరునవ్వులు చిందిస్తూ.. ముగ్గు ఎలా వేస్తుందో గమనిస్తున్నాడు. యంగ్‌ హీరోహీరోయిన్లకు మేమేం తక్కువ కాదన్నట్టుగా నరేశ్‌ టీం విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్ వీడియో ట్రెండింగ్‌ అవుతూ.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నరేశ్ హోంబ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌పై తెరకెక్కిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సహజనటి జయసుధ, శరత్‌ బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎన్‌ బాల్‌రెడ్డి కెమెరామెన్‌. వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. సురేశ్‌ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు-కన్నడ బైలింగ్యువల్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement