Saturday, June 3, 2023

బీఆర్ఎస్ నేత కుమార్తె కన్నుమూత.. సంతాపం తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ లోని చైతన్యపురి నివాసి, కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతి నర్సిరెడ్డి కూతురు కుమారి ఉష గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చైతన్యపురిలోని వారి నివాసానికి వెళ్లి, మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, మాజీ కార్పొరేటర్స్ విఠల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రమణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement